: 108 వాహనంలోనే కన్నుమూసిన గర్భిణి
ప్రసవ వేదనతో బాధ పడుతున్న నిండు గర్భిణిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా, పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే కన్ను మూసింది. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని సీతంపేట మండలం బిదిండిగూడ గ్రామానికి చెందిన సవర అనురాధ (22) ప్రసవ వేదనతో బాధపడుతుండగా పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో, అక్కడి డాక్టర్లు శ్రీకాకుళం ఆసుపత్రికి రెఫర్ చేశారు. దీంతో, 108 వాహనంలో ఆమెను శ్రీకాకుళం తరలిస్తుండగా పాలవలస గ్రామం వద్ద ఆమె కన్ను మూశారు.