: ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్లో మోదీ ప్రభుత్వం: మాయావతి ఆరోపణ


ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ లో మోదీ ప్రభుత్వం ఉందంటూ బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ శాసిస్తోందనడానికి మోదీ అక్కడకు వెళ్లడమే నిదర్శనమన్నారు. మోదీ ప్రభుత్వంపై అంత ప్రేమ కనబరుస్తున్న ఆర్ఎస్ఎస్ కు ఆయన పాలనలో అదుపు తప్పిన ధరలు, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు కనబడటం లేదా? అంటూ నిలదీశారు. గత యూపీఏ పాలనలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్, 10 జన్ పథ్ చెప్పుచేతల్లో నడుస్తున్నారంటూ నాడు మోదీ విమర్శించారే... ఇప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ చేతిలో రిమోట్ కాలేదా? అంటూ మాయావతి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News