: కోర్టుకు హాజరు కాని ప్రొఫెసర్లు అరెస్టు


ఐఐటీ రూర్కీకి చెందిన సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్లు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఒడిషాలోని తెహ్రి జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒకటి మూడేళ్ల క్రితం (2012లో) కూలిపోయింది. ప్రొఫెసర్లు విజయ్ ప్రకాష్, విజయ్ కుమార్ గుప్తాలు అలకానంద నదిపై వంతెన నిర్మాణానికి గతంలో డిజైన్ రూపొందించారు. అయితే, నిర్మాణం పూర్తి కాకుండానే మూడేళ్ల క్రితం ఆ వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఒక జూనియర్ ఇంజినీర్ తో పాటు మొత్తం ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. దీంతోపాటు పెద్ద మొత్తంలో ప్రజాధనం గంగలో పోసినట్టయింది. ఈ ఘటనకు సంబంధించి వంతెనను నిర్మిస్తున్న రెండు కన్ స్ట్రక్షన్ కంపెనీల యజమానులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే, బ్రిడ్జ్ డిజైన్ ను రూపొందించిన ఈ ప్రొఫెసర్లిద్దరికీ కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ వారు స్పందించకపోవడంతో... వారికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. దీంతో, వారిని వారి నివాసాల నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News