: చంద్రబాబుగారూ... ఆ గొంతు మీది కాదని లోకేష్ పై ప్రమాణం చేస్తారా?: వైసీపీ నేత తమ్మినేని


తెలుగు రాష్ట్రాలను ఊపేసిన ఓటుకు నోటు కేసు కోర్టు పరిధిలోకి వెళ్లినప్పటికీ, ప్రతిపక్షాలు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా సీఎం చంద్రబాబుపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నాయి. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులోని ఫోన్ సంభాషణలలో ఉన్న గొంతు సీఎం చంద్రబాబుదేనని నిర్ధారిస్తూ తాను తన కొడుకుపై దేవుడి ముందు ప్రమాణం చేస్తానని చెప్పారు. అయితే ఆ గొంతు మీది కాదని మీ కుమారుడు లోకేష్ పై ప్రమాణం చేయగలరా? అని ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. బాబు ఏపీకి నివాసం మార్చగానే పిడుగులు పడి 20 మంది చనిపోయారని లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ్మినేని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు వాటిని గాలికొదిలేశారన్నారు. రుణమాఫీ పేరుతో కొత్త రుణాలు లేకుండా చేశారని, దానికి మీరు బాధ్యత వహిస్తారా? లేక సింగపూర్ ఏజెన్సీ ఏదైనా బాధ్యత వహిస్తుందా? అని నిలదీశారు.

  • Loading...

More Telugu News