: శరణార్థులను ఆదుకోవడానికి 6.6 బిలియన్ డాలర్లను కేటాయించిన జర్మనీ


ఈ ఏడాది చివర్లోగా సిరియా, ఇరాక్, ఎరిత్రియాల నుంచి దాదాపు 8 లక్షల మంది శరణార్థులు జర్మనీకి వస్తారని ఆ దేశ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, నిరాశ్రయులకు అండగా నిలవాలని జర్మనీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా తన బడ్జెట్లో నిరాశ్రయుల కోసం కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో, వచ్చే ఏడాది 6.6 బిలియన్ డాలర్ల నిధులను కాందిశీకుల కోసం జర్మనీ ఖర్చు చేయనుంది. అయితే, ఎక్కువ సహాయం డబ్బు రూపంలో కాకుండా, ఇతర రూపాల్లో ఉంటుంది.

  • Loading...

More Telugu News