: స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన డ్రోన్ తో తొలిసారి పాకిస్థాన్ అటాక్
తమ సొంత గడ్డపై ఉంటూనే తమ దేశంలో దారుణాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులపై పాకిస్థాన్ డ్రోన్ (మానవ రహిత విమానం) తో దాడులు జరిపింది. ఈ దాడుల్లో ముగ్గురు కీలక ఉగ్రవాదులు హతమయ్యారని పాక్ అధికారులు వెల్లడించారు. దాడుల్లో ఉపయోగించిన 'బురాక్' డ్రోన్ ను పాకిస్థాన్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసింది. ఇప్పటిదాకా పాక్ ఉపయోగించిన డ్రోన్ లు అన్నీ విదేశీ పరిజ్ఞానంతో తయారైనవే. బురాక్ డ్రోన్ ద్వారా ఉగ్రవాదులు ఎక్కువగా ఉండే శవాల్ లోయలో క్షిపణులను జారవిడిచి, ముగ్గుర్ని అంతమొందించింది పాక్.