: ఉద్యోగం ఎప్పుడిస్తారు?..సీఎం బాబుని ప్రశ్నించిన మత్స్యకార యువకుడు
డీఎస్సీ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో చేపలమ్ముకుంటున్నానంటూ మత్స్యకార యువకుడొకడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో చెప్పాడు. దీంతో కంగుతున్న చంద్రబాబు ఆ యువకుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన వివరాలు... విశాఖపట్టణంలో ఆదివారం నాడు చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నున్న చేపలా మార్కెట్ కు వెళ్లారు. చేపలమ్ముకుంటున్న ఓ యువకుడితో.. మీ సమస్యలేంటని బాబు ప్రశ్నించారు. దీంతో మత్స్యకార యువకుడు త్రినాథ్ తన కష్టాన్ని ఏకరువు పెట్టారు. 2014లో డీఎస్సీ క్వాలిఫై అయి 45 వ ర్యాంకు సాధించానని, ఇంతవరకూ పోస్టింగ్ యివ్వలేదని, జీవనోపాధి కోసం చేపలు అమ్ముకుంటున్నానని.. తనకు ఉద్యోగం ఎప్పుడిస్తారని ఆ యువకుడు బాబుని ప్రశ్నించాడు. వారం రోజుల్లో డీఎస్సీ పోస్టింగ్ లిచ్చే ఏర్పాటు చేస్తున్నామని బాబు సమాధానమిచ్చారు.