: తెలంగాణ భాషాదినోత్సవ నిర్వహణపై ఉత్తర్వులు
ప్రజాకవి కాళోజీ జయంతిని ఈ నెల 9న తెలంగాణ భాషాదినోత్సవంగా నిర్వహించడంపై ప్రభుత్వం నుంచి ఈ రోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో కాళోజీ చిత్ర ప్రదర్శన నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ మాండలికంలో నవలలు, నాటకాలు, కవిత్వంపై పోటీల నిర్వహణ ఉంటుంది. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో కాళోజీ జీవితం, కవిత్వంపై చర్చ జరగనుంది. ఆయన జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషకు, సాహిత్య రంగంలో విశేషకృషి చేసిన వారికి ఆయన పేరిట స్మారక పురస్కారం అందివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.