: పార్టీ ఉనికి కోసమే హోదాపై కాంగ్రెస్ ఆందోళనలు: బీజేపీ ఎంపీ కంభంపాటి


ప్రత్యేక హోదాపై ప్రజలను మోసం చేశారంటూ మోదీ, వెంకయ్య, చంద్రబాబులపై ఏపీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఫిర్యాదులపై బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు మండిపడ్డారు. పార్టీ ఉనికి కోసమే హోదాపై ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ఏదో ఒక రకంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలనే కాంగ్రెస్ తాపత్రయపడుతోందని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏపీకి ఎన్నడూ లేనంత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం చేసిందని హరిబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా మంచిదా? లేక ప్రత్యేక ప్యాకేజీ మంచిదా? అని కేంద్రం ఆలోచిస్తోందని చెప్పారు. కాగా రాష్ట్ర విభజన సమయంలో ఎటువంటి సరైన జాగ్రత్తలనూ కాంగ్రెస్ తీసుకోలేదని, అందుకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని అన్నారు.

  • Loading...

More Telugu News