: అక్రమంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు వెళ్లడం ఎంతవరకు న్యాయం?: సీపీఐ రామకృష్ణ


విజయవాడ కృష్ణానది కరకట్టపై కొత్తగా నిర్మించిన ఇంట్లోకి సీఎం చంద్రబాబు వెళ్లడంపై సీపీఐ తీవ్ర విమర్శలు చేస్తోంది. వివాదాస్పదంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు వెళ్లడం ఎంతవరకు న్యాయం అని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి అంతటి వ్యక్తే కృష్ణానది కరకట్టపై అక్రమ భవనాన్ని నిర్మించుకుంటే ఇక అక్రమాలకు అడ్డు చెప్పేదెవరన్నారు. ఓవైపు నదీ గర్భంలో అక్రమంగా భవనాలు నిర్మించారని మంత్రి ఉమా అంటున్నారని, అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. అయితే తాను(బాబు) నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్ అక్రమమో, సక్రమమో సీఎం చెప్పాలని అనంతపురంలో విలేకరుల సమావేశంలో రామకృష్ణ నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరకు సీఎం తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. రాయలసీమ విద్యార్థులకు శాపంగా మారిన 120 జీవో రద్దు చేయాలని కోరిన ఆయన, చంద్రన్న రైతుయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News