: ఏపీలో 'పిడుగుల వర్షం' అత్యంత విషాదకరం: రాహుల్ గాంధీ
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 20 మందికి పైగా చనిపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ట్విట్టర్' ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల పడ్డ పిడుగులకు ప్రజల ప్రాణాలు పోవడం కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం, ఏపీపై ఉపరితల ఆవర్తనం కారణంతో, నిన్న పలు ప్రాంతాల్లో పడ్డ భారీ వర్గాలు, పిడుగుల కారణంగా పలువురు మరణించిన సంగతి తెలిసిందే.