: సన్నీలియోన్! దేశం విడిచివెళ్లిపో... జంతర్ మంతర్ వద్ద వ్యతిరేక నిరసనలు
శృంగార తార, బాలీవుడ్ నటి సన్నీలియోన్ పై కొన్నిరోజుల కిందట సీపీఐ జాతీయనేత అతుల్ కుమార్ అంజన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెను వ్యతిరికిస్తూ కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశం విడిచి పోవాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొంతమంది వ్యక్తులు సన్నీపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. "దేశం విడిచిపో.. భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను కలుషితం చేయకు" అంటూ ధర్నా చేస్తున్నారు. ఈ మధ్య సన్నీ నటించిన ఓ కండోమ్ వాణిజ్య ప్రకటన భావోద్వేగం రెచ్చగొట్టేలా ఉందని, అత్యాచారాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను సన్నీ కూడా ఖండించింది. అటు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కూడా సన్నీకి మద్దతుగా నిలిచింది.