: ట్యాంక్ బండ్ పై మందుబాబు వీరంగం... పోలీసులు, మీడియాపై దుర్భాషలు
అర్ధరాత్రి మద్యం తలకెక్కిన ఓ మందుబాబు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై వీరంగమాడాడు. తనను నిలువరించేందుకు యత్నించిన పోలీసులపైనే కాక తన వీరంగాన్ని రికార్డు చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపైనా అతడు చిందులు తొక్కాడు. వివరాల్లోకెళితే... వరంగల్ లోని రత్న హోటల్ యజమాని కొడుకు అభిషేక్ రెడ్డి నిన్న హైదరాబాదు వచ్చి ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ తర్వాత మద్యం మత్తులోనే తన కారుతో రోడ్లపైకి వచ్చేశాడు. ట్యాంక్ బండ్ పై తన ముందు వెళుతున్న ఓ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో తనను నిలువరించేందుకు వచ్చిన పోలీసులను అతడు దుర్భాషలాడాడు. ఈ ఘటనను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులతో పాటు అటుగా వెళుతున్న వాహనదారులపైనా అతడు నోరు పారేసుకున్నాడు. నానా తంటాలు పడి ఎలాగోలా అతడిని పోలీసులు అక్కడినుంచి పంపించివేశారు.