: నగరాలను స్మార్ట్ సిటీలుగా చేయడం కష్టమే...కానీ అసాధ్యమేమీ కాదు: వెంకయ్యనాయుడు


భారత నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చడం కష్టమైన పనేనని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. స్మార్ట్ సిటీలపై హైదరాబాదులో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ప్రాంతీయ సదస్సులో ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఈ సదస్సుకు 12 రాష్ట్రాలకు చెందిన 40 నగరాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చే బృహత్కార్యం కష్టమే అయినా అసాధ్యమేమీ కాదని ఆయన పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల రూపకల్పనకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాక ఈ కార్యక్రమంలో ఆయా నగరాల మేయర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News