: తెలంగాణలో రెండేళ్లపాటు పాత మద్యం పాలసీనే... ఒకరోజు ముందుగానే సంతకం పెట్టిన కేసీఆర్
తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న మద్యం పాలసీ కాల పరిమితిని మరో రెండేళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. పాత పాలసీనే కొనసాగించాలని తీర్మానించిన ప్రభుత్వం ఆదాయం నష్టపోకుండా కూడా పలు జాగ్రత్తలు తీసుకుంది. గత లైసెన్స్ ఫీజులకు ఈ ఏడాది 10 శాతం అదనంగా ఫీజు వసూలు చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ ఫీజును మరో 10 శాతం మేర పెంచుతారు. ఈ మేరకు నిన్న తన క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ చంద్రవదన్ లతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన ఏకంగా సదరు ఫైలుపై సంతకం కూడా చేసేశారు. నేటి ఉదయం చైనా పర్యటనకు బయలుదేరే ముందు ఈ ఫైలుపై కేసీఆర్ సంతకం చేస్తారని అధికారులు భావించినా, నిన్ననే ఆయన సంతకం చేసేశారు.