: యాదాద్రికి భూరి విరాళం... రూ.5కోట్లను ప్రకటించిన ‘రాజు వేగేశ్న ఫౌండేషన్’


తెలంగాణ తిరుమలగా వినుతికెక్కుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ‘రాజు వేగేశ్న ఫౌండేషన్’ భూరి విరాళాన్ని ప్రకటించింది. రూ.5 కోట్లతో ఆలయంలో అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్ ను నిర్మించేందుకు ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ అనంతకోటి రాజు వేగేశ్న, ఆనంద్ రాజు, రాజేశ్ తిరుమల రాజు నిన్న కలిసిన సందర్భంగా ఈ భూరి విరాళాన్ని ప్రకటించారు. యాదాద్రితో పాటు తెలంగాణలోని ధర్మపురి, భద్రాచలం, బాసర, వేములవాడ, కొమురవెల్లి, కాళేశ్వరం, భద్రకాళి ఆలయాల్లోనూ వాటర్ ప్లాంట్లను నిర్మించేందుకు ఆ సంస్థ సంసిద్ధతను వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News