: సచిన్ ను దాటేసిన కోహ్లీ!


టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను దాటేశాడు. ఆటలో యమ దూకుడు ప్రదర్శించే కోహ్లీ, సోషల్ మీడియాలోనూ తనదైన స్పీడుతో దూసుకెళుతున్నాడు. ట్విట్టర్ లో ఈ యువ సంచలనానికి ఫాలోవర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ విషయంలోనే అతడు సచిన్ ను దాటేశాడు. ప్రస్తుతం ట్విట్టర్ లో సచిన్ కు 77.3 లక్షల మంది ఫాలోవర్లున్నారు. కోహ్లీని అనుసరిస్తున్న వారి సంఖ్య 80.01 లక్షలకు చేరుకుంది. ఇక టీమిండియా వన్డే, టీ20 ఫార్మాట్ల సారథి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ట్విట్టర్ లో 45.2 లక్షల మంది ఫాలోవర్లున్నారు.

  • Loading...

More Telugu News