: మరికాసేపట్లో చైనా టూరుకు కేసీఆర్... భారీ బృందంలో ఎవరెవరంటే...!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరికాసేపట్లో చైనా టూరుకు బయలుదేరనున్నారు. మంత్రులు, అధికారులతో కలిసి ఆయన నేటి ఉదయం 10 గంటలకు శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చైనా బయలుదేరతారు. కేసీఆర్ వెంట ఈ దఫా భారీ బృందమే బయలుదేరుతోంది. ఈ బృందంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్ రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులున్నారు. ఇక అధికారుల విషయానికొస్తే... సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం అదనపు కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, సెక్యూరిటీ ఐజీ మహేశ్ భగవత్, సీఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖరరెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, సీఎం వ్యక్తిగత కార్యదర్శి సంతోశ్ కుమార్, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి, మిషన్ మేనేజర్లు జగదీశ్ రామడుగు, శివానీ శంకర్ తదితరులు సీఎం వెంట చైనా వెళుతున్నారు.