: రేపు ఉదయం చైనా వెళ్లనున్న కేసీఆర్... వారం రోజులు బిజీబిజీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉదయం చైనా పర్యటనకు బయల్దేరుతున్నారు. ఆయనతో పాటు 15 మందితో కూడిన బృందం కూడా వెళుతోంది. ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న వీరు... సాయంత్రానికి డేలియన్ సిటీకి చేరుకుంటారు. 9వ తేదీన డేలియన్ సిటీలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత డేలియన్ నుంచి షాంఘై వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. 11న బీజింగ్ వెళతారు. 14వ తేదీన షెంఘన్ ఇండస్ట్రియల్ పార్కును సందర్శిస్తారు. అనంతరం హాంకాంగ్ కు వెళతారు. ఆ తర్వాత 16వ తేదీన హైదరాబాదుకు తిరుగుపయనమవుతారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది.