: కాంగ్రెస్ పార్టీది అరాచకవాదం, ఫ్యాక్షన్ వాదం: టీఆర్ఎస్
మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీది అరాచకవాదం, ఫ్యాక్షన్ వాదమని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. తమ ఎమ్యెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి చేసిన దాడిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. రామ్మోహన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దారుణంగానే ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ సొంత కార్యాలయాలనే తగలబెట్టుకునే చరిత్ర ఆ పార్టీ నేతలదని దుయ్యబట్టారు.