: కాళోజీ జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా జరపాలని నిర్ణయించిన కేసీఆర్


ప్రజాకవిగా ఎనలేని కీర్తి గడించిన కాళోజీ నారాయణరావుకు గొప్ప గౌరవం దక్కింది. ఆయన జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా నిర్వహించాలని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలో, ఈ నెల 9వ తేదీన హైదరాబాదులో కాళోజీ జయంత్యుత్సవాలు అధికారికంగా జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భాష చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తామని సీఎం తెలిపారు. అంతేకాకుండా, తెలంగాణ భాషపై వ్యాస రచన, ఉపన్యాస పోటీలు, చర్చాగోష్ఠి పోటీలు నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. భాష, సాహిత్య రంగాల్లో కృషి చేసిన వారికి కాళోజీ పురస్కారం ఇస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News