: పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ సైకో సిరంజి దాడి
పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా సైకో సిరంజి దాడి మరొకటి జరిగింది. తణుకు నుంచి ఆటోలో వెళ్తున్న వెంకటలక్ష్మి అనే మహిళపై సిరంజి దాడి చేశారు. బాధితురాలిని తణుకు ఆసుపత్రికి తరలించారు. బైకుపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారని ఇరగవరం మండలం కె.ఇల్లింద్రపర్రుకు చెందిన వెంకటలక్ష్మి చెబుతోంది. సైకో సిరంజి దాడుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా, ప్రజలు భయపడాల్సిన పని లేదని సైకోను పట్టుకుంటామని పోలీసు అధికారులు చెబుతుండటం గమనార్హం.