: కరెన్సీలో కొత్త నంబరింగ్ విధానం: ఆర్ బీఐ
కరెన్సీలో కొత్త నంబరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కు చెందిన అధికారులు వెల్లడించారు. ఆర్ బీఐ నోట్ ముద్రణా ప్రయివేట్ లిమిటెడ్, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా కొత్త విధానంలో రూపొందించనున్న నోట్లను ముద్రించనున్నట్లు చెప్పారు. నకిలీ కరెన్సీని నియంత్రించే ప్రయత్నాలలో భాగంగా ఫేక్ నోట్లను గుర్తించేందుకు ఏడంచెల భద్రతా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కూడా చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు చెప్పలేదు. రూ.500, రూ.1000 నోట్ల వినియోగం వాడుకలో ఎక్కువగా ఉన్నందున తొలి దశలో ఆ నోట్లకు నంబరింగ్ విధానాన్ని మారుస్తున్నట్లు వివరించారు. కొత్త నంబరింగ్ విధానంలో ఉండే నోట్లు 2016 మే నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.