: టీఆర్ఎస్ ఎంపీకి తృటిలో తప్పిన ప్రమాదం
మెదక్ జిల్లా జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ మధ్యాహ్నం మెదక్ జిల్లాలోని కల్హేర్ మండలం చందర్ నాయక్ తాండా వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి, బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. అయితే, పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.