: భద్రాచలం ఆలయ భూములను పేదలకు పంచండి: మావోయిస్టులు


ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు మళ్లీ కలకలం రేపారు. ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలం ప్రధాన రహదారిపై మావోల పోస్టర్లు దర్శనమిచ్చాయి. వెంకటాపురం మావోయిస్టు కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టర్లను అతికించారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం భద్రాచలం ఆలయానికి చెందిన భూములను వెంటనే పేదలకు పంచాలని ఈ పోస్టర్లలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. అలాగే పోలవరం, కంతనపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని అన్నారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ ను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ప్రజాయుద్ధం ద్వారా తిప్పికొడతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News