: ఆర్ఎస్ఎస్ రాజ్యాంగేతర శక్తి కాదు... మాకు అమ్మ వంటిది: వెంకయ్యనాయడు
కేంద్ర మంత్రులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఆర్ఎస్ఎస్ తో భేటీ అవుతున్నారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ అంటే రాజ్యాంగేతర శక్తి కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ తల్లి అయితే, బీజేపీ బిడ్డలాంటిదని వివరించారు. తల్లి దగ్గరకు పిల్లలు వెళితే తప్పా? అని ప్రశ్నించారు. ఉన్నతమైన జాతీయ భావాలు గల ఆర్ఎస్ఎస్ తో తాము సంప్రదింపులు జరిపితే తప్పేంటని వెంకయ్య ప్రశ్నించారు. యూపీఏ హయాంలో ప్రధాని నివాసంలో కాకుండా సోనియా నివాసంలో కీలక నిర్ణయాలు తీసుకునేవారని... ఆ రకంగా చూస్తే సోనియాగాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని మండిపడ్డారు.