: చంద్రబాబుకు సైకో లక్షణాలు ఉన్నాయన్న అంబటి


ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైకాపాను సైకో పార్టీ అంటూ టీడీపీ విమర్శించడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. సైకో అంటే అర్థం ఏమిటో టీడీపీ నేతలకు తెలుసా? అని ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడేవారిని, ప్రవర్తించేవారిని సైకోలు అంటారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా... మీకు పిచ్చి పట్టింది, ఇది లోటస్ పాండ్ కాదు, మీ అంతు చూస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారని... ఈ వ్యాఖ్యలతో ఆయనకు సైకో లక్షణాలు ఉన్నాయన్న సంగతి అర్థమవుతోందని అన్నారు. ఓటుకు నోటు కేసు విషయంలో అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలేక చంద్రబాబు తన ఛాంబర్ కే పరిమితమయ్యారని... ఇంత దారుణమైన పరిస్థితుల్లో మరే ముఖ్యమంత్రి లేరని ఎద్దేవా చేశారు. 450 ఏళ్ల కిందట ఏర్పడిన హైదరాబాదును కూడా తానే నిర్మించానని చంద్రబాబు చెబుతున్నారని... ఇలా మాట్లాడే వారికే సైకో లక్షణాలు ఉంటాయనేది అర్థమవుతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News