: నాకంత సమయం ఉండటం లేదు: ప్రధాని మోదీ
తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, ప్రజల సంక్షేమమే ముఖ్యమని, పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఫరీదాబాద్ - బాదర్ పూర్ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గుజరాత్ తరువాత తాను హర్యానాలోనే అధిక కాలం, పాటు ఉన్నానని వెల్లడించిన ఆయన, విపక్షాల విమర్శలపై స్పందించేంత తీరిక ఉండటం లేదని వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. దేశంలో ప్రతిఒక్కరికీ సొంతింటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రతి పేదవాడి సొంతింటి కల సాక్షాత్కారం చేస్తామని హామీ ఇచ్చారు.