: ఏపీకి రూ. 23 వేల కోట్లిచ్చాం, హోదాపై మాత్రం ఏమీ చెప్పలేను: పురందేశ్వరి


ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ. 23 వేల కోట్లను సాయంగా అందించిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి వివరించారు. కర్నూలు జిల్లా నంద్యాల పర్యటనలో ఉన్న ఆమె ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. ఏపీకి మొత్తం రూ. 63 వేల కోట్లు ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా వుందని ఆమె వివరించారు. ఇంకా ఏవైనా సహాయాలు కావాలంటే, కేంద్రానికి తగు ప్రణాళికలు పంపాలని చంద్రబాబు సర్కారుకు ఆమె సూచించారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం పూర్తిగా సిద్ధమని, ఆమె అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఎంతవరకూ వస్తుందన్న విషయాన్ని చెప్పలేమని వ్యాఖ్యానించారు. పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదాకన్నా, ప్యాకేజీ కావాలనే కోరుతున్నాయని పురందేశ్వరి వివరించారు.

  • Loading...

More Telugu News