: డిగ్గీ, అమృత పెళ్లి చేసుకున్నారా?


సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్, టీవీ జర్నలిస్టు అమృతారాయ్ వివాహం చేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. గత నెలలో తమిళనాడులో వాళ్లిద్దరూ వివాహం చేసుకున్నట్టు తమకు సమాచారం అందిందని ఒక ఆంగ్ల దినపత్రిక ప్రకటించింది. దిగ్విజయ్ సింగ్ కు అత్యంత సన్నిహితుల నుంచి తమకు ఈ సమాచారం తెలిసినట్టు పేర్కొంది. ప్రస్తుతం డిగ్గీ అమెరికాలో ఉన్నట్టు తెలిసింది. అమృత కూడా సెలవులో ఉందని సమాచారం. 68 సంవత్సరాల డిగ్గీ, 44 ఏళ్ల వయస్సున్న అమృతల ప్రేమ వ్యవహారం గత కొన్నేళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే.. గత ఏప్రిల్ లో వారి ప్రేమ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ స్వయంగా అంగీకరించాడు కూడా. అప్పటి నుంచి వీరి వివాహం విషయమై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీరిద్దరూ ఒకరయ్యారన్న వార్తలు వస్తున్నప్పటికీ, అధికారికంగా అటు దిగ్విజయ్, ఇటు అమృతల నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.

  • Loading...

More Telugu News