: చిటికలు వేస్తూ పాపాయిని ఆడించిన ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ కాసేపు చిన్నారిని ఆడించాడు. చిటికెలు వేస్తూ, నెలల వయసున్న బుజ్జాయిని పలకరించిన ఆయన, బుగ్గలు నిమిరి ఆశీర్వదించారు. ఈ ఘటన, నేటి ఉదయం బాదర్ పూర్, ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగింది. ఈ రైలును ప్రారంభించిన మోదీ, బోగీ ఎక్కి కాసేపు ప్రయాణించారు. ఈ సందర్భంగా అప్పటికే రైల్లో ఉన్న ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. పలువురిని తన పక్కన కూర్చోబెట్టుకుని ముచ్చటించారు. ఓ యువతి తన బిడ్డను తీసుకురాగా, కాసేపు ఆడుకున్నారు. పలువురితో సెల్ఫీలు దిగారు. ఆయన ఆశీర్వాదం పొందేందుకు వచ్చిన స్టూడెంట్ల భుజం తట్టి ప్రోత్సహించారు. ప్రధాని మోదీని తాము ఇలా కలుస్తామని అసలు ఊహించుకోలేదని వెల్లడించిన ఓ మహిళా టెక్కీ, మోదీ పక్కన కూర్చోగా, ఎక్కడ పనిచేస్తున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ ఆమె క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో ఆయన ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.