: కుమారుడి గొంతుకోసిన కన్నతండ్రి
కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్న కొడుకు గొంతు కోశాడో దుర్మార్గపు తండ్రి. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో గత రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పట్టణంలో నివాసం ఉండే షేక్ బాబ్జీ తన కుమారుడు షేక్ బహదుల్లా (15)పై దాడి చేసి అతని గొంతు నరికాడు. అనంతరం తన చేతి నరాలపై గాయాలు చేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తండ్రి దాడిలో గాయపడ్డ బహదుల్లాను స్థానికులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వివరించారు.