: వర్షాలొస్తున్నాయ్!
వచ్చే 24 గంటల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. చత్తీస్ గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ అల్ప పీడన ద్రోణి ఏర్పడుతోందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. దీనికి అదనంగా తెలంగాణ నుంచి లక్షద్వీప్ వరకూ మరో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశాలున్నాయని, ఈ రెండు ద్రోణులు కలసి వస్తే తెలంగాణ, ఏపీల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవవచ్చని అభిప్రాయపడ్డారు.