: కుక్క పిల్ల నోట్లోకి సిగరెట్ పొగ ఊదిన నిఫ్ట్ విద్యార్థులు... సామాజిక మాధ్యమం ద్వారా వెలుగు చూసిన ఘటన!


వారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) విద్యార్థులు. లాబ్రాడర్ జాతికి చెందిన ఓ కుక్కపిల్లను హింసించారు. దర్జాగా సిగరెట్లు తాగుతూ, పొగను కుక్కపిల్ల నోట్లోకి ఊదారు. దీన్ని దారిన పోతున్న వారెవరో వీడియో తీశారు. సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. దీన్ని చూసిన జంతు హక్కుల సంస్థ, క్యాంపస్ కు వెళ్లి, ఈ ముగ్గురు ఇడియట్లను కనిపెట్టారు. నిఫ్ట్ విద్యార్థి నరేంద్ర సింగ్, అతని స్నేహితులు రోహిత్ పంచపాల్, సుర్యాంశు రాజ్ లు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిని స్టేషనుకు పిలిపించి రూ. 2,500 జరిమానా విధించారు. కుక్కపిల్లను సంరక్షణాలయానికి పంపారు. ఈ మొత్తం ఘటనతో తోటి విద్యార్థుల మధ్య ఈ ముగ్గురి పరువు పోయింది. మరి సోషల్ మీడియానా? మజాకా? అన్నట్టు ఈ ఘటన ముంబై నిఫ్ట్ లో జరిగింది.

  • Loading...

More Telugu News