: కార్పొరేట్ల బంపర్ బొనాంజా... క్యాంపస్ ప్లేస్ మెంట్లలో 25 శాతం పెరిగిన వేతన ఆఫర్


ఐఐఎంలో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థుల ముందు కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వేతన ఆఫర్ 24.8 శాతం పెరిగింది. కోల్ కతా విద్యార్థులకు అత్యధికంగా రూ. 33.7 లక్షల ప్యాకేజీ లభించింది. పీజీ పూర్తి చేసుకున్న వారి సరాసరి వేతనం గత సంవత్సరంతో పోలిస్తే 21.6 శాతం పెరిగి సాలీనా రూ. 22.69 లక్షలకు చేరుకుందని కళాశాల అధికారులు తెలిపారు. మొత్తం 50 మంది విద్యార్థులుండగా, 44 మందికి 54 ఆఫర్లు వచ్చాయని వివరించారు. ఒక్క కోల్ కతాలో మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా మిగిలిన ఐఐఎంలు, ఐఐటీల్లోనూ ఇదే పరిస్థితి. నైపుణ్యం చూపే యువతకు కార్పొరేట్లు బంపర్ ఆఫర్లు దగ్గర చేస్తున్నాయి. యాక్సెంచర్, అమేజాన్, డెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫోర్డ్ మోటార్స్, స్నాప్ డీల్, అటాస్ కన్సల్టింగ్, డెల్లాయిట్, ఒరాకిల్, సీఈఎస్సీ, ఓమ్నీ యాక్టివ్, మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీలు భారీ వేతన ప్యాకేజీలతో గ్రాడ్యుయేట్లను ఆకర్షిస్తున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులను నియమించుకుంటున్న కంపెనీల్లో ఐటీ/కన్సల్టింగ్ సంస్థలు ముందు నిలువగా, ఆపై ఐటి ప్రొడక్ట్స్, ఈ-కామర్స్ కంపెనీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వీటితో పాటు అనలిటిక్స్, కేపీఓ, పవర్, బీపీఓ, రియల్ ఎస్టేట్ సంస్థలు నిలిచాయి. ఐఐఎంలలో విద్యను పూర్తి చేసుకున్న వారికి అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ డైరెక్టర్, సీనియర్ ప్రిన్సిపిల్ కన్సల్టెంట్, డీజీఎం-ఫైనాన్స్ తదితర పోస్టులు లభిస్తున్నాయి.

  • Loading...

More Telugu News