: మా సంగతీ కాస్త చూడండి: చంద్రబాబుకు తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల లేఖ


తెలంగాణలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని బాధితులు ఆయనకు లేఖ రాశారు. ఎన్నో ఏళ్లుగా పేదలు, మధ్య తరగతి ప్రజల నుంచి వందల కోట్ల రూపాయల డబ్బు వసూలు చేసిన అగ్రిగోల్డ్ సంస్థకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కస్టమర్లున్నారు. ఇప్పుడు కేసు ఏపీ పరిధిలో ఉండటం, ఆ సంస్థ ఆస్తులమ్మి న్యాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో తమ సంగతీ చూడాలని తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం కోరుతోంది. అగ్రిగోల్డ్ లో ఏజంట్లుగా పనిచేసిన వారిపై దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికే 50 మంది వరకూ ఆత్మహత్యలు చేసుకున్నారని వివరిస్తూ, యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమ డబ్బు తమకు ఇప్పించాలని వారు విన్నవించారు. డబ్బు రాకుంటే ఖాతాదారులు, ఏజంట్ల ఆత్మహత్యలు మరింతగా పెరిగే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News