: నా కలల్లో ఇదొకటి: చంద్రబాబు
ఇండియాలో ఒలింపిక్ ఆటల పోటీలు నిర్వహించాలన్నది తన కలగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. విశాఖలో జాతీయ స్థాయి జూనియర్ అథ్లెటిక్ గేమ్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, గతంలో తాను అధికారంలో ఉన్న సమయంలో ఆప్రో ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్, మిలటరీ గేమ్స్ నిర్వహించామని గుర్తు చేశారు. దేశంలో క్రికెట్ తో పాటు మిగతా అన్ని క్రీడలనూ ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు. ఏపీలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తయారు చేస్తామని తెలిపారు. ఇండియా నుంచి ఒలింపిక్ ప్లేయర్లు తయారయ్యే దిశగా ఏపీ నాంది పలుకుతుందని చంద్రబాబు వివరించారు. నైపుణ్యమున్న ఆటగాళ్లను వెలికితీసి వారికి మరింత శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.