: 'ఏ' కేటగిరీ ఆటగాడిగా షోయబ్ మాలిక్


పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను పీసీబీ 'ఏ' కేటగిరీ కాంట్రాక్టులోకి తీసుకుంది. తాజా సిరీస్ లో ఉత్తమ ప్రదర్శన కనబరచడంతో మాలిక్ ను ఏ కాంట్రాక్టు వరించింది. 2015-2016 సంవత్సరానికి గాను ఆటగాళ్ల కాంట్రాక్టులు పీసీబీ ఖరారు చేసింది. ఇందులో సానియా మీర్జా భర్త, ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్, టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్, వన్డే కెప్టెన్ అజహర్ అలీ, టీట్వంటీ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ, మాజీ కెప్టెన్లు యూనిస్ ఖాన్, మహ్మద్ హఫీజ్ లను 'ఏ' కాంట్రాక్టు జాబితాలో చోటు సంపాదించుకున్నారు. మాలిక్ ని 'ఏ' కేటగిరీలోకి తీసుకోవడంతో సయీద్ అజ్మల్ ను 'బీ' కేటగిరీకి పరిమితం చేసింది. ఈ ఏడాది నాలుగు కేటగిరీల్లో 27 మంది ఆటగాళ్లకు పీసీబీ కాంట్రాక్టు ఒప్పందం చేసుకుంది.

  • Loading...

More Telugu News