: వారిని అడ్డుకోము...ఆశ్రయం కల్పిస్తాం: ఏంజెలా మోర్కెల్


సిరియా, ఆఫ్రికా, ఇరాక్, ఎరిట్రియా వంటి దేశాల నుంచి వచ్చే శరణార్థులను అడ్డుకోమని జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మోర్కెల్ తెలిపారు. శరణార్థులను అనుమతించే అంశంలో తమకు ఎలాంటి న్యాయపరిమితులు లేవని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరికల్లా 8 లక్షల మంది శరణార్థులు జర్మనీ చేరుకునే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. శరణార్థులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆమె ప్రకటించారు. వారికి ఇళ్లు నిర్మించే ఆలోచనలో ఉన్నామని ఆమె తెలిపారు. కాగా, అంతర్యుద్ధం కారణంగా, సిరియా, ఇరాక్ ల నుంచి యూరోపియన్ దేశాలకు వలసలు పెరుగుతున్నాయి. తాజాగా, చిన్నారి అయలాన్ కుర్దీ దారుణ మృతి ఉదంతం వెలుగు చూడడంతో శరణార్థులపై సానుకూలంగా స్పందించాలని యూరోపియన్ దేశాలు నిర్ణయించాయి.

  • Loading...

More Telugu News