: జర్మనీ, ఆస్ట్రియా దేశాల పెద్దమనసు... వలసదారులకు ఆశ్రయం!


అయలాన్ కుర్దీ మృతదేహం ఫోటో ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. ఆ ఫోటో ప్రచురితమై కథనాలు వెల్లువెత్తడంతో పలు దేశాల్లో కదలిక వచ్చింది. సిరియా, ఆఫ్రికా దేశాలకు చెందిన వలసదారులపై జర్మనీ, ఆస్ట్రియా దేశాలు పెద్దమనసు చూపాయి. వలసదారులు వస్తే ఆంక్షలు విధించమని, తమ దేశాల్లో తలదాచుకునేందుకు ఆశ్రయమిస్తామని జర్మనీ, ఆస్ట్రియా దేశాలు తెలిపాయి. దీంతో అక్కడికి వలసలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు 5000 నుంచి 10000 మంది వలసదారులు చేరుకునే అవకాశం ఉందని జర్మనీ పోలీసుల అధికార ప్రతినిధి స్టీఫెన్ సోన్టేగ్ తెలిపారు. అయితే ఎంత మంది వస్తారు? అన్న సమాచారం లేదని, ఎంత మంది వచ్చినా వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News