: చైనాలో సరికొత్త ట్రెండ్...అక్కడ ఒక్క గర్ల్ ఫ్రెండే ఉంటే కనుక అబ్బాయి గారికి నామోషీ!
చైనాలోని డాంగ్వాన్ నగరంలో ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ ను అక్కడ ఎక్కువ శాతం మంది అనుసరిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ఆ సరికొత్త ట్రెండ్ వివరాల్లోకి వెళ్తే...ఆక్కడ పురుషుడు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కే పరిమితమైతే కనుక నామోషీ అట! అతనిని అంతా గేలి చేస్తారు. చేతకాని వాడిలా చూస్తారు. ఎందుకంటే, అక్కడ ప్రతి ఒక్కరూ ఇద్దరు లేదా అంతకు మించిన గర్ల్ ఫ్రెండ్స్ ను కలిగిఉంటారు. ఈ విషయంలో దాపరికం కూడా లేదంటారు. తన బాయ్ ఫ్రెండ్ కి వేరే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసినా వారు పట్టించుకోరు సరికదా, వారితో కూడా చక్కగా కలిసిపోతారట. కొన్ని సందర్భాల్లో బాయ్ ప్రెండ్ తో గర్ల్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అక్కడ బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటైన్ చేయడానికి అమ్మాయిలే ఖర్చు చేస్తారు. గిఫ్టులే కాదు, డబ్బులు కూడా ఇస్తుంటామని అక్కడి అమ్మాయిలు తెలిపారు. ప్రపంచ ఉత్పత్తుల ఫ్యాక్టరీగా పేరొందిన డాంగ్వాన్ లో ఉద్యోగాల్లో మహిళలకే ప్రాధాన్యత. అంతే కాకుండా అక్కడ వంద మంది అమ్మాయిలకు 89 మంది అబ్బాయిలే ఉన్నారు. తమ బాయ్ ఫ్రెండ్ కు మరో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసినా అక్కడి వారు ఈర్ష్య పడకపోవడం విశేషం. అక్కడ ఉద్యోగాలిచ్చిన కంపెనీలే యువతులకు వసతి సౌకర్యం కల్పిస్తాయి. అయితే అక్కడ స్వేచ్ఛ లేదనుకుంటే యువతులు బయట ఇళ్లు తీసుకుని ఉంటారు. ఇలా ఇద్దరు ముగ్గురు యువతులు కలి ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ వస్తే వారికి ఏకాంతం కల్పించేందుకు మిగిలిన వారు ప్రయత్నిస్తారు. వీలైతే ఏకాంతంగా గడపాలని భావించిన ప్రేమికులకు తమకు మధ్య ఓ కర్టెన్ ఏర్పాటు చేసుకుంటారు, లేదా వాకింగ్ కు అలా బయటకు వెళ్లొస్తారు. అలా చేయడంలో తమకు ఇబ్బంది లేదని వారు అభిప్రాయపడడం విశేషం. ఈ సరికొత్త సంస్కృతిపై చైనా సమాజంలో ఆందోళన వ్యక్తమవుతుండగా, అమ్మాయిల సంఖ్యా ఎక్కువ అయితే ఇలాగే ఉంటుందని మరి కొందరు సమర్థిస్తున్నారు. అయితే ఆ పట్టణంలోని మహిళలు మాత్రం తాము డీసెంట్ గర్ల్స్ అంటున్నారు. ఎంత మందిని ప్రేమించినా 27 ఏళ్ల వయసు వచ్చాక బుద్ధిగా ఇంటికెళ్లి పెద్దలు కుదిర్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటామని చెబుతున్నారు.