: మారుతి స్విఫ్ట్ నుంచి భారత మార్కెట్లోకి మరో కారు
కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా భారత మార్కెట్ లోకి మరో కారును తీసుకొచ్చింది. లిమిటెడ్ ఎడిషన్ లో స్విఫ్ట్ ఎస్పీ పేరుతో కారును విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో ఉన్న ఈ కార్ల ధరలు (ఢిల్లీ ఎక్స్ షోరూం) రూ.4.78 లక్షలు, రూ.5.84 లక్షలుగా సంస్థ ప్రకటించింది. డీలర్ల ద్వారా రూ.10వేలతో ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నట్టు మారుతి పేర్కొంది. త్వరలోనే తమ అన్ని మారుతీ షోరూంలలో ఈ కార్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.