: సరిహద్దులో పాకిస్థాన్ మళ్లీ కాల్పులు !


దాయాది దేశమైన పాకిస్థాన్ మళ్లీ కాల్పులకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్ లోని ఫూంచ్ జిల్లాలో ఎల్ఓసీ వెంబడి శనివారం ఉదయం వరుస కాల్పులకు తెగబడింది. ఎటువంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే కృష్ణా ఘాటి సెక్టార్ లో పాక్ కాల్పులు జరిపినట్టు రక్షణ శాఖకు చెందిన అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ కాల్పుల్లో భారత జవాన్ ఒకరు గాయపడ్డారు. ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరో సంఘటనలో.. హమ్రీపూర్ సెక్టార్లోని ఎల్ఓసీ వెంబడి కూడా పాక్ దారుణానికి పాల్పడింది. సుమారు గంటసేపు పాక్ కాల్పులకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఈ నెలలో పాకిస్థాన్ ఆరుసార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్టయింది.

  • Loading...

More Telugu News