: భారతదేశం 'బుద్ధిస్ట్ ఇండియా'లా అనిపిస్తుంది!: నరేంద్ర మోదీ
హిందూ, బౌద్ధ మతాల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుద్ధగయలో అంతర్జాతీయ బౌద్ధుల ముగింపు సమావేశంలో శనివారం నాడు ఆయన పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మోదీ అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. థీమ్స్, నమ్మకాలు, పద్ధతులకు సంబంధించి ఈ రెండు మతాలు దగ్గరగా ఉంటాయన్నారు. అందుకే భారతదేశం 'బుద్ధిస్ట్ ఇండియా' అని తనకు తోస్తోందని అన్నారు. దేశంలో చీలిక వాతావరణం ఏర్పడడానికి కొన్ని మతాలకు చెందిన శక్తులు వాళ్ల నమ్మకాలను ఇతరులపై రుద్దడమే కారణమని మోదీ అభిప్రాయపడ్డారు. సుమారు 20 నిమిషాల పాటు సాగిన ప్రధాని ప్రసంగంలో పలు విషయాలను ప్రస్తావించారు.