: తెలంగాణ విద్యావ్యవస్థలో సమూల మార్పులు: కడియం
తెలంగాణ విద్యావ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడుతూ, అన్ని స్థాయుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. అవి త్వరలోనే అమలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. సామాజిక రుగ్మతలను రూపు మాపాలన్నా, సమాజంలో జీవన స్థితిగతులు మారాలన్నా విద్య చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశలో కష్టపడి చదివితే జీవితం సాఫీగా సాగిపోతుందని ఆయన బోధించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు.