: తండ్రీకొడుకులను కలిపిన ఫేస్ బుక్
సామాజిక మాధ్యమాలు కేవలం కొత్త స్నేహితులను కలపడంతోనే ఆగిపోవడం లేదు. తప్పిపోయిన వాళ్లను కూడా కలుపుతున్నాయి. సినిమాను తలపించేలా ఫేస్ బుక్ తండ్రీకొడుకులను కలిపింది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన అఖ్తర్ అలామ్ అనే వ్యక్తి 1996 నుంచి కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి ఆయన కుమారుడు బబ్లూ ఆయన కోసం వెతుకుతున్నాడు. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ 70 ఏళ్ల అఖ్తర్ ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టింది. దానిని గుర్తించిన బబ్లూ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఆ స్వచ్ఛంద సంస్థను కలిసి వివరాలు తీసుకుని తన తండ్రిని కలిశారు.