: టీఆర్ఎస్ నేతలపై రావుల తీవ్ర వ్యాఖ్యలు
టీఆర్ఎస్ నేతలపై టి.టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. రౌడీయిజంలో వారు బీహార్ ను మించిపోయారని మీడియా సమావేశంలో విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.బాలరాజు నిన్న (శుక్రవారం) చేయి చేసుకున్న నేపథ్యంలో రావుల ఈ విధంగా స్పందించారు. కాగా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.