: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త...త్వరలో 12 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు డీజీపీ జేవీ రాముడు శుభవార్త చెప్పారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, త్వరలోనే 12 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని ప్రకటించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ఇంచుమించు అరికట్టామని ఆయన తెలిపారు. 90 శాతం ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీతో నేరాలకు చెక్ పెడుతున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేసి మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.