: భారత్ పై డ్రోన్ దాడులకు ఉగ్రవాదుల పథకం...నిఘా వర్గాల హెచ్చరిక


భారత్ లోకి దొంగచాటుగా ప్రవేశించిన పాకిస్థాన్ ఉగ్రవాదులు దేశ వ్యాప్తంగా దాడులకు తెగబడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ దాడులకు ఉగ్రవాదులు ఏ తరహాలో పాల్పడతారనే దానిపై కూడా స్పష్టమైన సమాచారం ఉన్నట్టు తెలిసింది. అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఎవీలు), అన్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ (యూఎఎస్ లు), పారా గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, రిమోట్ ద్వారా నియంత్రించే ఫ్లైయింగ్ ఆబ్జెక్టులు, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ లతో దాడులకు దిగే అవకాశముంది. లష్కరే తోయిబా ఉగ్రవాది సయ్యద్ జైబుద్దీన్ అన్సారీ అలియాస్ అబు జుందాల్, ఇండియా ముజాహిదీన్ సంస్థకు చెందిన సయ్యద్ ఇస్మాయల్, ఖలిస్తాన్ మిటిటెంట్ లీడర్ జగ్తార్ సింగ్ తారాలను విచారణ చేసిన సందర్భంలో అధికారులకు ఈ విషయాలు తెలిశాయి. ఉగ్రవాదులకు పారా చూట్ జంపింగ్ లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ శిక్షణ యిస్తున్నట్టు సమాచారం. పారా గ్లైడింగ్ కు సంబంధించిన పరికరాలను చైనా, యూఏఈ దేశాలలోని కంపెనీల నుంచి తీసుకువస్తున్నారు. పాకిస్థాన్ కంపెనీలు డ్రోన్ల నిర్వహణలో సాంకేతిక సామర్థ్యాన్ని సమకూరుస్తున్నాయని ఉగ్రవాదుల విచారణలో తేలింది.

  • Loading...

More Telugu News