: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... బందర్ పోర్టు భూసేకరణకు ఆమోదం


హైదరాబాద్ లోని ఏపీ సచివాలయంలో ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో దాదాపు మూడు గంటల వరకు సమావేశం జరిగింది. మచిలీపట్నం పోర్టుకు ల్యాండ్ పూలింగ్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పోర్డుకు 14వేల ఎకరాల భూమి అవసరమని మంత్రివర్గం తెలిపింది. ఇక వ్యవసాయానికి పగటిపూట 7 గంటల నిరంతరాయ విద్యుత్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఏపీఐఐసీకి భూములను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతికి కార్యాలయాల తరలింపుకు కూడా కేబినెట్ ఆమోదం లభించింది. రెండంకెల వృద్ధిరేటు సాధించడంపై విస్తృతంగా చర్చించారు. ఇక పాలన పట్ల నెలవారీగా ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News